ధరణి అమలుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ధరణి సహా వివిధ అంశాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
అనధికారిక, అనుమతుల్లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను అందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలని... ఈ మేరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
గ్రామాల్లో రైతువేదికలు, పల్లెప్రకృతి వనాల పనులు త్వరగా పూర్తి చేయాలన్న సీఎస్... రైస్ మిల్లర్ల నుంచి కస్టం మిల్లింగ్ బియ్యాన్ని గడువులోగా వచ్చేలా చూడాలని తెలిపారు. వీధివ్యాపారుల నమోదు ప్రక్రియ సహా రుణాల మంజూరు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లు, అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి : రాగల మూడు రోజుల పాటు వర్షాలు