ETV Bharat / city

ఈ ఫేక్ ‘కరోనా మొబైల్ యాప్స్’తో జాగ్రత్త..!

ఓవైపు ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంటే... సైబర్​ నేరగాళ్లు అమాయక ప్రజలకు ఉచ్చు బిగిస్తున్నారు. ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. రకరకాల మొబైల్​ యాప్స్​ను రూపొందించి ప్రజల వ్యక్తిగత డేటాను చౌర్యం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్‌లో కరోనా పేరుతో ఉన్న కొన్ని ఫేక్‌ మొబైల్‌ యాప్స్‌ గురించి తెలుసుకుందాం..!

be aware of corona fake applications
ఈ ఫేక్ ‘కరోనా మొబైల్ యాప్స్’తో జాగ్రత్త..!
author img

By

Published : Apr 14, 2020, 5:33 PM IST

కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతోన్న ఈ తరుణంలో.. ప్రజలకు తాము చేయగలిగిన సాయాన్ని చేస్తోన్న వారు కొందరైతే.. ఈ విపత్కర పరిస్థితిని అసరాగా చేసుకొని వాళ్లను మోసం చేస్తోన్న వాళ్లు మరికొందరు. ముఖ్యంగా సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ వేదికల ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇందులో భాగంగా కరోనా పేరుతో రకరకాల మొబైల్‌ యాప్స్‌ను సృష్టించి ఫోన్లలో ఉన్న బ్యాంక్‌ ఎకౌంట్‌ వివరాలు, సోషల్‌ మీడియా లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు.. తదితర ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.

కరోనా పేరుతో ఉన్న ఫేక్​ మొబైల్​ యాప్స్

CoronaVirus App

ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు సంబంధించిన పాజిటివ్‌ కేసులు, ఇతర సమాచారాన్ని మీకు యాప్‌ ద్వారా అందిస్తామని మీకు సందేశం వచ్చినా, ప్రకటన కనిపించినా.. దానిని నమ్మకండి. ఇవి మీ ఫోన్‌ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తుంటాయి. ఈ క్రమంలో ‘Coronavirus’ పేరుతో చలామణీలో ఉన్న ఓ మొబైల్‌ యాప్‌ కూడా మోసపూరితమైంది. ఈ యాండ్రాయిడ్‌ యాప్‌ Pin/Pattern లను పదే పదే ఇవ్వమని కోరుతుంది. తద్వారా ఆ యాప్‌లో ఉండే కోడ్‌ మీ ఫోన్‌లోకి ప్రవేశించి దానిని కంట్రోల్‌ చేస్తుంది.

Coronavirus Map

ఈ యాప్‌ ద్వారా మీరు కరోనాకు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ పొందవచ్చని ప్రచారం చేస్తారు. కానీ, నిజానికి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ ఫోన్‌లోకి Spy Software ఇన్‌స్టాల్‌ అవుతుంది. తద్వారా మీ అనుమతి లేకుండానే ఇంటర్నెట్‌ నుంచి Spyware (సాఫ్ట్‌వేర్‌ వైరస్‌) ఉన్న ఫైళ్లను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయ్యేలా ఇది ప్రోత్సహిస్తుంది.

Corona live 1.1

ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు మీ ఫోన్‌ లొకేషన్‌తో పాటు.. అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు, ఇతర మీడియా ఫైల్స్‌పై యాక్సెస్‌ రిక్వెస్ట్‌ అడుగుతుంది. అంతేకాదు, ఫొటోలు తీసేందుకు, వీడియో రికార్డ్‌ చేసేందుకు కూడా అనుమతి అడుగుతుంది. కానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో ‘Trojan Virus’ కి చెందిన ‘SpyMax Sample’ అనే వైరస్‌ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అవుతుంది. తద్వారా మీ ఫోన్‌లో ఉన్న సమాచారమంతా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది.

CoronaVirus Finder

మీకు చేరువలో కరోనా సోకిన వ్యక్తి ఉంటే.. వారిని ఈ యాప్‌ ద్వారా కనిపెట్టొచ్చని మీకు ప్రకటన వస్తుంది. కరోనాకు సంబంధించి మరిన్ని వివరాలు పొందడానికి ఇందుకోసం మీరు కొంత నగదు చెల్లించాలని సందేశం పంపిస్తారు. అంతేకాదు, మీరు ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు మీ క్రెడిట్‌ కార్డు, బ్యాంక్‌ ఎకౌంట్‌ వివరాలను దొంగిలిస్తుంది.

Corona-Apps.apk

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. మీకు క్షణాల వ్యవధిలో నోటిఫికేషన్లు పంపుతుంటుంది. ఈ యాప్‌ను అన్‌-ఇన్‌స్టాల్‌ చేస్తే తప్ప వీటిని ఆపలేం. ఈ నోటిఫికేషన్లను క్లిక్‌ చేసినప్పుడు మీ ఫోన్‌లో ఉన్న సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్తుంది.

COVID19 Tracker

ఈ యాప్‌ ఇన్‌స్టాల్ చేసినప్పుడు.. మీకు దగ్గర్లో ఉన్న కరోనా బాధితుల వివరాలను తెలిపేందుకు మీ ఫోన్ లాక్ స్క్రీన్‌ను కంట్రోల్ చేసేందుకు యాక్సెస్ అడుగుతుంది. ఒకసారి మీరు ఆ అనుమతి ఇస్తే.. 48 గంటల్లో $100 విలువ చేసే Bit Coin ఇవ్వాలని మిమ్మల్ని డిమాండ్‌ చేస్తుంది, లేదంటే మీ కాంటాక్ట్స్‌, మీడియా ఫైళ్లు, సోషల్‌ మీడియా అకౌంట్లు అన్నీ డిలీట్‌ చేస్తానని హెచ్చరిస్తుంది.

ఏం చేయాలి..?

  • ఒక మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే ముందు దాని గురించి ఒకటికి రెండు సార్లు విచారించండి.
  • వెబ్‌లింక్స్‌ కంటే కూడా Google Play Store, iOS AppStoreల నుంచే యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం మేలు.
  • ఒక యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తున్నప్పుడు మన ఫోన్‌ ఇచ్చే వార్నింగ్ మసేజ్‌లను గమనించండి. ఆ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయడం ప్రమాదకరమని తెలిపినప్పుడు దానిని డౌన్‌లోడ్‌ చేయకండి.
  • మీ ఫోన్‌లలో Anti Virus Softwareను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మేలు.

ఇకనైనా మొబైల్ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు తగిన జాగ్రత్తలు పాటిద్దాం.. మన సమాచారాన్ని కాపాడుకుందాం..!

ఈ యాప్‌ను ఉపయోగించండి..!

కరోనా వ్యాప్తిని కట్టడి చేసే దిశగా భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కరోనా గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ప్రత్యేకంగా ఓ మొబైల్‌ యాప్‌ను విడుదల చేసింది. దాని పేరే ‘ఆరోగ్య సేతు’. మన దేశంలో జరుగుతోన్న కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌ కేసులను కూడా ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో రికార్డ్‌ చేస్తున్నారు. మనం కరోనా తీవ్రత ఎక్కువున్న ప్రదేశాలకు వెళ్లినా, కరోనా సోకిన వ్యక్తి మనకు దగ్గరగా వచ్చినప్పుడు ఈ యాప్‌ సందేశాల ద్వారా మనల్ని అప్రమత్తం చేస్తుంది. ఈ యాప్‌ బ్లూటూత్‌, జీపీఎస్‌ ద్వారా పని చేస్తుంది. అత్యాధునిక బ్లూటూత్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ల ఆధారంగా ఈ యాప్‌ పని చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ యాప్‌ Android, iOS వినియోగదారులిద్దరికీ అందుబాటులోఉంది.

ఎలా ఉపయోగించాలి..?

* ప్లేస్టోర్‌ నుంచి ‘Aarogya Setu’ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

* యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాక.. మీ భాషను ఎంపిక చేసుకోండి.

* ‘Register Now’ పై క్లిక్‌ చేసి.. మీ మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి. ఇప్పుడు మీ ఫోన్‌కు వచ్చిన OTPని కూడా ఎంటర్‌ చేయండి.

* ఆ తర్వాత మీ పేరు, వయసు, వృత్తి, గత 30 రోజుల్లో మీరు ప్రయాణించిన దేశాలు.. తదితర వివరాలను నింపండి. ఇప్పుడు ‘Ready to volunteer in the time of need’ అనే ఆప్షన్‌ దగ్గర టిక్‌ చేసి, ‘Submit’ బటన్‌పై క్లిక్‌ చేయండి.

ఈ యాప్‌ ద్వారా కొవిడ్‌-19 హెల్ప్‌ సెంటర్లు, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌లు, పాటించాల్సిన జాగ్రత్తలు.. తదితర వివరాలను పొందవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.