ETV Bharat / city

కెప్టెన్సీకి కోహ్లీ గుడ్​బై.. వన్డే, టీ20 సారథిగా రోహిత్!

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 india squad)​ తర్వాత టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్​ శర్మకు(Rohith sharma captaincy) అప్పగించనున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని స్వయంగా కెప్టెన్​ కోహ్లీనే ప్రకటిస్తాడని వెల్లడించాయి.

కెప్టెన్సీకి కోహ్లీ గుడ్​బై
కెప్టెన్సీకి కోహ్లీ గుడ్​బై
author img

By

Published : Sep 13, 2021, 11:27 AM IST

వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ(kohli captain) తప్పుకోనున్నాడా? రోహిత్​ శర్మ ఈ పగ్గాలను అందుకోనున్నాడా? కొంతకాలంగా వినిపిస్తున్న వాదనలివి. ఇప్పటికే ఎంతో మంది అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు ద్వంద్వ కెప్టెన్సీని అమలు చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడీ ఊహాగానాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అక్టోబర్​లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్​ తర్వాత విరాట్(టెస్ట్​)​, హిట్​మ్యాన్(వన్డే, టీ20)​ సారథ్య బాధ్యతలు పంచుకుంటారని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.

కొద్ది నెలలుగా(ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఎక్కువగా) ఇదే విషయమై విరాట్​, రోహిత్​, టీమ్​ మెనేజ్​మెంట్​ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపాయి. త్వరలోనే కోహ్లీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటిస్తాడని వెల్లడించాయి.

"కోహ్లీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటిస్తాడు. అతడు మునపటిలా ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా ఫామ్​లో రావడానికి తన బ్యాటింగ్​పై దృష్టి పెట్టనున్నాడు" అని బోర్డు వర్గాలు తెలిపాయి.

కారణమిదేనా?

బ్యాట్​ పడితే పరుగుల వరద పారించే కోహ్లీ.. కొంత కాలంగా బ్యాటింగ్​లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇకపై బ్యాటింగ్​పై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నప్పటి నుంచి కోహ్లీ ఫ్యాన్స్​ విచారం వ్యక్తం చేస్తుండగా.. రోహిత్​ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

ఇదీ చూడండి: 'టీమ్ఇండియా భవిష్యత్ కెప్టెన్ రోహిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.