గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బడుగుల జవాన్‌లకు ఒక న్యాయం.... అగ్రకులాల జవాన్ కుటుంబాలకు ఒక న్యాయమా అని బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఇటీవల మరణించిన జవాన్ కిషన్ నాయక్ సంతాప సభ నిర్వహించారు. కిషన్ నాయక్ చనిపోయి నెల రోజులు అవుతున్నా ఇంత వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు గానీ ప్రభుత్వ నుంచి గానీ ఎలాంటి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
15 ఏళ్లుగా దేశ రక్షణ కోసం పోరాటం చేసిన కిషన్ నాయక్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. దేశంలో కులగజ్జి ఎక్కువైందని.. అందుకే వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశరక్షణలో భాగంగా ఏ జవాన్ మరణించిన ఒకే న్యాయం ఉండాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ ధర్నా!