రాష్ట్రంలో బలహీనవర్గాల (BC Reservations ) రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగించారు. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్లను పొడిగించారు. ఏ కేటగిరీలో ఏడు శాతం, బీ కేటగిరీ వారికి పదిశాతం, సీ కేటగిరీలో ఒక శాతం, డీ కేటగిరీలో ఏడు, ఈ కేటగిరీలో నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లు అమలవుతాయి. దీంతో పాటు ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితి ఐదేళ్ల మినహాయింపును కూడా పొడిగించారు.
2021 జూన్ ఒకటో తేదీ నుంచి 2031 మే నెలాఖరు వరకు బీసీ రిజర్వేషన్లు, ఐదేళ్ల మినహాయింపు కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: Lockdown: 99 శాతం మంది.. పోలీసులకు సహకరిస్తున్నారు: సీపీ