తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ(Bathukamma Sarees distribution)ను పురస్కరించుకుని ప్రభుత్వం మహిళలకు అందించే చీరల పంపిణీ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైందని, గ్రామ, వార్డు స్థాయి కేంద్రాలతో పాటు ఇళ్ల వద్ద వీటిని అందజేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు శైలజారామయ్యర్ తెలిపారు. కరోనా దృష్ట్యా పంపిణీ విధానాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు ఇచ్చామని, ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
810 రకాల జరీ చీరలు..
‘‘పండుగ సందర్భంగా పేద మహిళలకు కానుకగా, నేతన్నలకు ఉపాధి మార్గంగా ప్రభుత్వం గత అయిదేళ్లుగా బతుకమ్మ చీరల పథకాన్ని అమలుచేస్తోంది. మొత్తం రూ.333.14 కోట్లతో ఈ సంవత్సరం 1.08 కోట్ల (గతేడాది కంటే 14 లక్షలు అధికం) చీరలు పంపిణీ చేస్తున్నాం. పాలిస్టర్ ఫిలమెంట్, నూలు, జరీ అంచులతో 810 రకాల చీరలు అందుబాటులో ఉంటాయి’’ అని శైలజారామయ్యర్ వివరించారు.
ఆడబిడ్డలకు బహుమతి
2017 నుంచి 18 సంవత్సరాలు పైబడిన, ఆహార భద్రత కార్డ్ కింద నమోదైన మహిళలకు ప్రభుత్వం చీరలను బహుమతి(Bathukamma Sarees distribution)గా అందిస్తోంది. మరమగ్గాల నేత పని వారికి కూలీల పెంపుదల ద్వారా నిరంతరం పని కల్పిస్తూ వారి జీవన స్థితిని, నైపుణ్యాలను మెరుగుపర్చటంతో పాటు తెలంగాణ రాష్ట్ర పండుగ, మహిళలందరికీ ఇష్టమైన బతుకమ్మ పండుగ శుభదినాన మహిళలను ఒక బహుమతితో గౌరవించాలన్న లక్ష్యంతో ఈ చీరల పంపిణీని ప్రభుత్వం చేపట్టింది.
పాలిస్టర్ ఫిలిమెంట్తో జరీ చీరలు
మెప్మా, సెర్ప్ కింద స్వయం సహాయక బృందాలు, మహిళా ప్రతినిధులు నుంచి అభిప్రాయాలు, సలహాలతో పాటు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాషన్ డిజైన్‌కు చెందిన డిజైనర్లతో సరైన డిజైన్, ప్రామాణిక కొలతలతో నూతన డాబీ/జాకార్డ్ డిజైనులతో ఈసారి బతుకమ్మ చీరలు తయారు చేయించింది. ఈ ఏడాది 30 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగుల్లో తయారు చేయించారు. అన్ని డిజైన్లు, రంగులు కలిపి మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ చీరల(Bathukamma Sarees distribution)న్ని జరీ అంచులతో ఉన్నాయి. చీర మొత్తం 100% పాలిస్టర్ ఫిలిమెంట్ లేదా నూలుతో తయారైంది. 6.30 మీటర్ల పొడవు గల ఒక కోటి సాధారణ చీరల(Bathukamma Sarees distribution)తో పాటు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్ల పొడవు గల చీరలు 8 లక్షలు తయారయ్యాయి. చీరల పంపిణీ కోసం మొత్తం రూ. 333.14 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
నేతన్నలకు చేయూతగా..
సిరిసిల్ల ప్రాంతంలోని చేనేత సామాజిక వర్గాల్లోని పేదరికం, ఆత్మహత్యలను నివారించే విధంగా సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్లో గల 16వేల మంది నేత పనివారు, సంబంధిత కార్మికులకు నిరంతరం పని కల్పించేందుకు 20,000 పవర్‌లూమ్స్ మీద బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని 373 మాక్స్ సంఘాలు/ఎస్.ఎస్.ఐ యూనిట్లలో ఢాబీ/జకార్డులు బిగించి ఉన్న 10,000 – 16,000 పవర్‌లూమ్స్ పైన ఈ చీరలు తయారు చేశారు. చీరల తయారీ ద్వారా ఆ ప్రాంతాల్లోని మరమగ్గాల పనివాళ్లు, కార్మికుల జీవన స్థితిని మెరుగుపడటమే గాక సంబంధిత కార్మికులు, సిబ్బంది, హమాలీలు, ఆటోడ్రైవర్లు, వ్యాపారులకు ఉపకరిస్తోంది. పవర్లూమ్ నేత పనివాళ్ల నెలసరి ఆదాయాన్ని రూ.8వేల నుంచి రూ. 12వేలు, రూ. 16వేల, రూ. 20వేలకు పెరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది.
గతేడాది మాదిరి... ఈ సంవత్సరం కూడా కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ చీరల(Bathukamma Sarees distribution) పంపిణీ విధానాన్ని నిర్ణయించే స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చింది. ఆయా ప్రాంతంలోని పరిస్థితిని బట్టి... లబ్ధిదారుల ఇళ్ల వద్దే చీరల పంపిణి చేయటం లేదా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గ్రామ/వార్డు కేంద్రాల్లో చీరల పంపిణీ అనేది సంబంధిత జిల్లా పరిపాలనాధికారులు నిర్ణయించనున్నారు. తదననుగుణంగా చీరల పంపిణీ సకాలంలో పూర్తి చేయించటానికి అన్ని ఏర్పాట్లు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.