తెలంగాణ పర్యటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని తాకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా హుస్సేన్‌సాగర్ బతుకమ్మ ఘాట్‌లో ముందస్తు ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. సద్దుల బతుకమ్మ పండుగ రోజు లాల్‌బహదూర్ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేలాదిమంది కళాకారులతో బతుకమ్మల ర్యాలీని నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అందులో భాగంగా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వెలుగుల బతుకమ్మలను వినూత్నంగా ఏర్పాటు చేయటం వల్ల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ముగింపు రోజు బతుకమ్మ సంబురాల విజయోత్సవాన్ని పురస్కరించుకుని మిరుమిట్లు గొలిపే భారీ బాణసంచాను కాల్చటం వంటి ముందస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఇవీ చూడండి: చిన్ననాటి స్మృతులను నెమరువేసుకున్న గవర్నర్...