ఖతార్ రాజధాని దోహాలో ఇండియన్ ఎంబసీ, కల్చరల్ సెంటర్ సంయుక్తంగా సాంస్కృతిక కళ వైభవం నిర్వహించారు. తెలంగాణ ప్రజా సమితి సాంస్కృతిక విభాగానికి చెందిన మహిళలు, స్థానికంగా ఉంటున్న తెలుగువారు పాల్గొని బతుకమ్మ, జానపద కళలను ప్రదర్శించి ఆహూతులను అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖతార్‌లోని భారత రాయబారి కుమరన్, కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు మణికంఠన్, వివిధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొని మహిళలను అభినందించారు.
కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సమితికి ప్రదర్శించే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు చెనవేని తిరుపతి, ఉపాధ్యక్షులు గద్దె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులందరు కృతజ్ఞతలు తెలియజేశారు.
![bathukamma](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4867140_210_4867140_1572027108152.png)
ఈ కథనం చదవండి: ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!