ETV Bharat / city

గబ్బిలాల రాకతో ఆ పల్లెలో రక్తపాతం సమసిపోయింది!

గబ్బిలం.. ఈ పేరు వింటేనే ఓ వింతభావన కలుగుతుంది. మనిషి మెదడులో ఓ ఆందోళన మొదలవుతుంది. కానీ... ఆ గబ్బిలాల రాకతోనే ఓ పల్లెలో ప్రశాంతత నెలకొంది. ఒకప్పుడు ఫ్యాక్షనిజానికి అడ్డాగా పేరొందిన ఆ గ్రామం గబ్బిలాల పుణ్యాన శాంతికి నిలయంగా మారిపోయింది. ఎంతోమంది అపశకునంగా భావించే గబ్బిలం అక్కడి రక్తపాతాన్ని ఎలా పారదోలింది? ఎందరో అసహ్యించుకునే గబ్బిలం ఆ పల్లెకు సుఖసంతోషాలను ఎలా మోసుకొచ్చింది!? తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే...

author img

By

Published : Nov 13, 2019, 1:46 PM IST

గబ్బిలాల రాకతో ఆ పల్లెలో రక్తపాతం సమసిపోయింది!
గబ్బిలాల రాకతో ఆ పల్లెలో రక్తపాతం సమసిపోయింది!

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మాధవరంపోడు... కోడూరు పట్టణానికి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఆ పల్లెలోనే గబ్బిలాలను దేవతామూర్తులుగా కొలుస్తారు. ఈ గబ్బిలాలు వచ్చినప్పటి నుంచి గ్రామ ఇబ్బందులు తొలగిపోయాయని... అభివృద్ధి బాటలో ఉన్నామని వీరి నమ్మకం.

ఒకప్పుడు ముఠా తగాదాలతో గ్రామం రక్తసిక్తమై ఉండేది. ఈ పక్షుల రాకతో ప్రశాంతం వాతావరణం నెలకొందని గ్రామస్థుల చెబుతున్నారు. అప్పటి నుంచి ఆ పక్షులకు ప్రమాదం లేకుండా చూస్తున్నారీ పల్లె ప్రజలు. ఎవరినీ వేటాడనియ్యరు. ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తున్నారు. ఆ ఊరి ప్రజలే కాదు.. చుట్టుపక్కల ప్రజలకూ ఈ గబ్బిలాలు పూజాదేవుళ్లే.

గబ్బిలాల మలాన్ని వ్యాధిగ్రస్థులైన పిల్లల శరీరానికి పూసి స్నానాలు చేస్తే ఆరోగ్యవంతులవుతారని ఇక్కడి వారి నమ్మకం. దిష్టి తగలకుండా వాటి ఎముకలు మెడకు, మొలతాడుకు కట్టుకుంటారు. 35 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

ఒకప్పుడు... మాధవరంపోడులో గబ్బిలాలు ఒక చెట్టుకే ఉండేవి...ఇప్పుడవి విస్తరించాయి. రాత్రిపూట అడవికి వెళ్లి ఆహారం తిని తెల్లవారేసరికి గ్రామానికి చేరుకుంటాయి.

నిఫా వైరస్ గబ్బిలాలతో వచ్చిందని ప్రచారం జరిగినా ఈ ప్రాంత ప్రజలు పట్టించుకోలేదు. ఆ పక్షులతో ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్న ఈ గ్రామస్థులు.. తమకు మంచే జరుగుతుందని చెబుతున్నారు.

ఇదీ చదవండీ.. కన్న కొడుకును కత్తితో పొడిచి చంపేశాడు..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.