Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై న్యాయబద్దంగా పోరాడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే.. కరుణానిధి, జయలలిత, లాలూప్రసాద్ యాదవ్ అందరికీ గుర్తుకొస్తారని తెలిపారు. కేసీఆర్‌ను తప్పకుండా.. జైలులో వేస్తామని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పునరుద్ఘాటించారు.
చీకోటి ప్రవీణ్ వెనక సగం మంది తెరాస నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. భాజపా నేతలను తిట్టే తెరాస నేతలు వారం రోజులుగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ పాదయాత్ర ద్వారా.. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిని క్షేత్రస్థాయిలో ఎండగడతానన్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తారనే విషయంపై స్పందిస్తూ.. నేనెక్కడ పోటీ చేయాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల రాజేందర్ తన అభిప్రాయం చెప్పారని వివరించారు. ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేసేది అధిష్ఠానం చెప్తుందని పేర్కొన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడిందని సంజయ్ తెలిపారు.
'వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 15 సీట్లే గెలుస్తుంది. పాదయాత్రలో కేసీఆర్ అవినీతిని క్షేత్రస్థాయిలో ఎండగడతా. అవినీతి కేసులో కేసీఆర్‌ను తప్పకుండా జైలులో వేస్తాం. చీకోటి ప్రవీణ్ వెనక సగం మంది తెరాస నేతలున్నారు. నేను ఎక్కడ పోటీ చేయాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయం. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల తన అభిప్రాయం చెప్పారు. ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేసేది అధిష్ఠానం చెప్తుంది. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా భాజపా గెలుస్తుంది. తెలంగాణపై మోదీ, అమిత్ షాకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
పాతబస్తీ పని చూడటమే తమ పనిగా పేర్కొన్న బండి సంజయ్... హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో భాజపా గెలిస్తే దేశంలో సగం సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. మునుగోడు కాకుండా ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా గెలిచి తీరుతామని స్పష్టం చేశారు. ఉన్మాది అంటూ భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్... తాను రాజకీయ ఉన్మాదినే అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇవీ చదవండి: