ETV Bharat / city

'హిందూ పండగలకు ఆంక్షల పేరుతో సీఎం కేసీఆర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు' - గణేశ్ నిమజ్జనం

Bandi sanjay on Ganesh Immersion: తెరాస పాలనలో హిందువులు భిక్షమెత్తుకునే దుస్థితి ఏర్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. హిందూ పండగలకు ఆంక్షల పేరుతో సీఎం కేసీఆర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో వినాయ నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

Bandi sanjay
Bandi sanjay
author img

By

Published : Sep 8, 2022, 3:38 PM IST

Bandi sanjay on Ganesh Immersion: హిందూ పండగలకు ఆంక్షల పేరుతో సీఎం కేసీఆర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. అన్ని పండుగల విషయంలో సమీక్ష జరిపే ముఖ్యమంత్రి వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయం ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కరీంనగర్​లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోని అన్ని విగ్రహాలను టవర్‌ సర్కిల్ గుండా నిమజ్జనానికి తరలించాలని ఆయన సూచించారు.

తెరాస పాలనలో హిందువులు భిక్షమెత్తుకునే దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ మండిపడ్డారు. హిందువుల సంఘటితానికి ప్రతీకగా నిలిచే గణేష్ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం లేదన్నారు. వారంతా సంఘటితమైతే తన ఆటలు చెల్లవనే భావనతోనే ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్​ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయకుండా డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఈ విషయంలో కొందరు మంత్రులు ఆడే అబద్దాలకు అంతు లేకుండా పోయిందని.. సినిమా నటులను మించిపోతున్నారని విమర్శించారు. ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్ల విషయంలో భాగ్యనగర్​ గణేశ్​ ఉత్సవ సమితి నేతలు దీక్షలు చేయడంతోపాటు భాజపా పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేశామన్నారు. తాను వినాయక సాగర్ పర్యటనకు బయలుదేరుతున్నట్లు ప్రకటించిన తరువాతే ప్రభుత్వం దిగొచ్చి ఆదరబాదరగా హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్​ నిమజ్జన ఏర్పాట్లు చేసిందని అన్నారు. అవి కూడా తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.