Bandi Sanjay: తెలంగాణలో భాజపా అధికారం చేబట్టబోతోందని.. ఈ దిశగానే సర్వేలు చెబుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ రేకుర్తి రాజశ్రీ గార్డెన్లో భాజపా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జీల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయ్యిందని.. సంగ్రామ యాత్రపై దేశమంతా చర్చ జరిగిందని గుర్తు చేశారు. అధికారంలోకి భాజపా రాబోతుందని.. ఇప్పుడు మనం అధికారంలోకి రాకపోతే ఇలాంటి అవకాశం మళ్లీ రాదన్నారు.
కేటీఆర్ అహంకారంతో కండ కావురంతో మాట్లాడుతున్నాడని, ఆయన భాష చూసి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటోందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్కు "సన్" స్ట్రోక్ స్టార్ట్ అయ్యింది.... ఆ సన్ స్ట్రోక్తోనే కుటుంబ పాలన అంతం కాబోతుందన్నారు. శ్రీలంకలో కుటుంబ పాలన కారణంగా అధోగతి పాలయ్యిందని.. కేసీఆర్ కుటుంబ పాలన వల్ల తెలంగాణలో ప్రజల పరిస్థితి కూడా హీనంగా తయారయ్యిందని ఆయన చెప్పారు. త్వరలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని తెలిపారు.
"రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాబోతోందని సర్వేలు చెబుతున్నాయి. కేసీఆర్కు "సన్" స్ట్రోక్ స్టార్ట్ అయ్యింది. కేసీఆర్ కొడుకు అసభ్యకరమైన పదజాలాన్ని వినియోగిస్తున్నారు. శ్రీలంక కుటుంబ పాలన కారణంగా అధోగతి పాలయ్యిందో.. కేసీఆర్ కుటుంబ పాలన వల్ల తెలంగాణలో ప్రజల పరిస్థితి కూడా హీనంగా తయారయ్యింది. త్వరలోనే ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుంది. ఎన్నికల వరకు కూడా ప్రజాసంగ్రామ యాత్ర జరగుతూనే ఉంటుంది." -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: