ETV Bharat / city

Bandi Sanjay Comments: 'రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్లకు సహకరిస్తాం' - ముఖ్యమంత్రి కేసీఆర్​ పన్నాగం

Bandi Sanjay Comments: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర కేసులో భాజపా నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఖండించారు. భాజపాను అప్రతిష్ఠపాలు చేసేందుకు సీఎం కేసీఆర్​ పన్నిన పన్నాగమే ఈ డ్రామా అని అభివర్ణించారు.

Bandi Sanjay Comments on allegations on bjp leaders in minister murder plan

author img

By

Published : Mar 3, 2022, 7:59 PM IST

Updated : Mar 3, 2022, 10:43 PM IST

భాజపాను అప్రతిష్ఠపాలు చేసేందుకు కేసీఆర్​ పన్నాగాలు..

Bandi Sanjay Comments: భాజపాని అప్రతిష్ఠపాలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ పన్నాగం పన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. అవినీతి మంత్రి శ్రీనివాస్​గౌడ్​ని కాపాడబోయి తప్పు మీద తప్పులు చేస్తున్నారని స్పష్టం చేశారు. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన తెరాస నాయకుడు సాజిద్ ఖాన్​ను ఇక్కడ పట్టుకోలేదు కానీ.. ఏ తప్పు చేయని వాళ్లని దిల్లీ వెళ్లి మరీ పట్టుకొచ్చారని పోలీసులపై విమర్శలు చేశారు. అవినీతి మంత్రులపై సానుభూతి పెంచేందుకే కేసీఆర్​ ఈ ఎత్తుగడ వేస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని.. అందుకోసం అన్ని విచారణ సంస్థలను ఆశ్రయిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్లకు సహాయ, సహకారాలు అందిస్తామని బండి సంజయ్​ పేర్కొన్నారు.

కేసీఆర్​ అవినీతిని అడ్డుకుంటాం..

"భాజపా హత్య రాజకీయాలు సమర్థించదు. రిమాండ్ రిపోర్ట్​లో భాజపాకి సంబంధం లేదని బయటపడింది. ఎఫ్​ఐఆర్​లో కానీ, పోలీసుల దర్యాప్తులోగానీ... ఎక్కడా భాజపా నేతల పేర్లు రాకపోయినా వారిపై ‌అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. దిల్లీ వెళ్లి వారెంటు లేకుండానే జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. జితేందర్‌రెడ్డి డ్రైవర్‌పై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఏం చేసినా నడుస్తుందని తెలంగాణ పోలీసులు అనుకుంటున్నారు. ఎవరి అనుమతితో వెళ్లి జితేందర్‌రెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేశారు..? ఇది పక్కా కిడ్నాప్‌ వ్యవహారమే. చట్టాలను చదువుకున్న అధికారులే వాటిని కాలరాసేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ పోలీసులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది భాజపానేనని సర్వేలన్ని అంటున్నాయి. దాంతో ముఖ్యమంత్రి డిఫ్రెషన్​లో పడ్డారు. సలహాలు, సూచనల పేరుతో హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని అడ్డుకుంటాం." - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఎలా ముందుకెళ్లాలి..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా నేతలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ హత్య కుట్ర కేసు ఆరోపణలపై చర్చించారు. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు.

విడుదలైన తఫాకు అభినందనలు..

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసు కుట్రలో దిల్లీలో అరెస్టయిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తిలక్‌ తాఫా సొంత పూచీకత్తుపైన విడుదలయ్యారు. అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ని కలిశారు. తాఫాను అభినందించిన బండి సంజయ్.. అరెస్ట్ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 3, 2022, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.