ETV Bharat / city

గవర్నర్​గా ప్రజలతో మమేకమయ్యా: దత్తాత్రేయ - బండారు దత్తాత్రేయ వార్తలు

ప్రజలతో మమేకమై పని చేస్తున్నట్లు హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాల గురించి పంచుకున్నారు.

bandaru dattatreya
bandaru dattatreya
author img

By

Published : Sep 11, 2020, 3:35 PM IST

బండారు దత్తాత్రేయ హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు దత్తాత్రేయ తెలిపారు. ప్రజా జీవితంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా అనేక హోదాల్లో పనిచేసినట్లు గుర్తు చేశారు. గవర్నర్​గా రాజ్యాంగబద్ధపదవిలో ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయాల కులపతిగా హిమాచల్​ప్రదేశ్​లోని అన్ని వర్సిటీలను సందర్శించి... విద్యార్థులతో మాట్లాడినట్లు దత్తాత్రేయ తెలిపారు. గిరిజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు వివరించారు. ఫార్మా రంగ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లు వెల్లడించారు. ప్రజలతో మమేకమై పని చేస్తున్నట్ల పేర్కొన్నారు.

గవర్నర్​గా ప్రజలతో మమేకమయ్యా: దత్తాత్రేయ

ఇదీ చదవండి: 'పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.