ETV Bharat / city

వెదురు కంద కూర.. ఆ రుచే వేరబ్బా.. - bamboo shoot curry in andharapradesh

వెదురును మనం చాలా రకాలుగా ఉపయోగిస్తాం. నిచ్చెనలు, బల్లలు, కుర్చీలు, బుట్టలు, తట్టలు, చాటలు వంటి గృహోపకరణాలకూ ఇలా చాలా రకాలుగా వినియోగిస్తాం. వెదురు కర్రలతో చేసే.. బొంగులో చికెన్ కూడా మనకు తెలుసు. వెదురు గింజల్ని అన్నంగా తినటం చూశాం. అంతే కాదు.. వెదురు నుంచి తీసిన చిగురు దీన్ని వెదురు దవ్వ, వెదురు కంద అని పిలుస్తారు.. దీనితోనూ గిరిపుత్రులు కూరలు వండి నోరూరిస్తున్నారు. ఆ వెదురు కంద కూర.. వహ్వా .. అంటూ లొట్ట లేసుకుని తింటారంట మరి దాని కథేమిటో చూసేద్దామా..

bamboo shoot curry
వెదురు కంద కూర.. ఆ రుచే వేరబ్బా..
author img

By

Published : Oct 24, 2020, 1:10 AM IST

వెదురుకంద అనగానే ఇదేదో మైదాన ప్రాంతాల్లో దొరికే కందలాంటిది అనుకునేరు. కాదండోయ్‌!చినుకుకాలంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన గిరిజన ఆహారమే ఈ వెదురుకంద. వెదురు కలపగానే ఎక్కువ మందికి తెలుసు. కానీ లేత వెదురుతో నోరూరించే కూరను సైతం తయారు చేయవచ్చు. అది కూడా ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే! గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వెదురు సాగు ఉంటుంది. వాటి నుంచి తీసిన సహజ సిద్దమైన ఆహార పదార్థమే ఈ వెదురు కంద. ఏటా జూన్‌ నుంచి ఆగస్టు వరకు వెదురు కంద తీస్తుంటారు. ఈ మూడు నెలల్లో పడిన వర్షాలకు వెదురు మొక్క చిగురిస్తుంది. దాని నుంచి పొట్ట (కంద భాగం) బయటకు వస్తుంది. ఈ పొట్ట భాగాన్ని తొలగిస్తారు. తొలగించిన పొట్టను శుభ్రం చేసి ముక్కలుగా కూరకు అనుకూలంగా తరుగుతారు. ఇది ఎటువంటి ఎరువులు, పురుగు మందుల ప్రభావం లేని సహజ సిద్ధ్దమైన ఆహారం.

చేదుగా ఉండే వెదురు తరుగుని బాగా మెత్తగా ఉడకబెట్టి.. నీరు వార్చేయటం ద్వారా అందులో వగరు తగ్గిపోతోంది. అప్పుడు గిరిజనులు దానిని ఇగురుగా, కూరగా చేసుకుని తింటారు. వెదురు గడ్డను ఉడకబెట్టి వార్చిన నీరు కూడా అత్యంత రుచికరంగా ఉంటుందంటున్నారు.. గిరిజనులు. దానిని చారులా తయారు చేసుకుంటామని చెబుతున్నారు.

వెదురు కందను బఠానీ లేదా మునగ ఆకులు కలిపి వండితే 'ఆహా' ఆ రుచే వేరు. కొండ ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమయ్యే వెదురు కందను కొన్ని సందర్భాల్లో గిరిజనులు పల్లపు ప్రాంత గ్రామాలకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అరుదుగా దొరికే వెదురు కందకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. గిరిజనులు మాత్రం మూడు నెలలు పాటు దీన్నే కూరగా చేసుకుంటారు. గిరిజన ప్రాంతాల్లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు.. వెదురు చిగుళ్ల కషాయం చలువ చేస్తుందని అంటున్నారు. కఫం, రక్తశుద్ధి, మూలవ్యాధి, మదుమేహం లాంటి వ్యాదుల నివారణకు పనికి వస్తుందంటున్నారు. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాలతోపాటు సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా ప్రాంతంలోనూ వెదురు కంద లభ్యమవుతుంది.

ఇదీ చూడండి: బతుకమ్మ సంబురాలు సంతృప్తినిచ్చాయి: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.