ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్(nbk helping hands ) ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి(basavatarakam cancer hospital), ఎన్టీఆర్ ట్రస్ట్(ntr trust blood bank) సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాని(blood donation camp)కి విశేష స్పందన లభించింది. దాదాపు 120 మంది బాలయ్య బాబు అభిమానులు(balakrishna fans) పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అభిమానులు అందించిన రక్తాన్ని బసవతారకం ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల ద్వారా అవసరమైన వారికి అందించనున్నారు. ఈ సందర్భంగా రక్తదాతలకు నందమూరి వసుంధరా దేవి సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన ఆమె.. వారికి పండ్లు పంచిపెట్టారు.
ఆస్పత్రి సీఈఓ డా. ఆర్వీ ప్రభాకర రావు, మెడికల్ డైరెక్టర్ డా. టీఎస్ రావు, అసోసియేట్ డైరెక్టర్ డా. కల్పనా రఘునాథ్‌తో పాటు ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్, అనంతపురం నిర్వాహకులు జగన్, భగత్ సింగ్ నగర్ సినిమా హీరో విదార్థ, హీరోయిన్ ధృవిక సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: