ETV Bharat / city

తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడులు.. ఎన్ని కోట్లో తెలుసా?

Premier Energy Group Investments: తెలంగాణలోని ప్రీమియర్ ఎనర్జీ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్‌తో జట్టు కట్టిన ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్... హైదరాబాద్‌లో తన ప్లాంట్‌ను మరింతగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు హైదరాబాద్ ఈ-సిటీలో నూతన ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పత్రాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు.

Azure Power is a global company
Azure Power is a global company
author img

By

Published : Jun 13, 2022, 10:55 PM IST

Updated : Jun 14, 2022, 3:52 AM IST

Big Investments in Telangana: రాష్ట్రంలో సౌరవిద్యుత్‌ పరికరాల ఉత్పత్తి, విద్యుత్‌ వాహనాల రంగాల్లో మరో రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మూడు సంస్థలు నిర్ణయించాయి. అమెరికాకు చెందిన అజ్యూర్‌ పవర్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌, భారత్‌కు చెందిన ప్రీమియర్‌ ఎనర్జీ గ్రూపులు సంయుక్తంగా హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్‌ సిటీలో రూ.700 కోట్లతో సోలార్‌సెల్‌, మాడ్యూల్‌ల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. దీని ద్వారా మూడు వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ రెండు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పత్రాలను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సోమవారం అందజేశారు. యూఏఈకి చెందిన మెటా4 సంస్థ రూ.250 కోట్లతో జహీరాబాద్‌లో ద్విచక్ర విద్యుత్‌ వాహనాల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించింది.

ప్రీమియర్‌, అజ్యూర్‌ల సౌర విద్యుత్‌ పరిశ్రమ : హైదరాబాద్‌లో ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ సిటీలో ప్రీమియర్‌ ఎనర్జీ పరిశ్రమను నిర్వహిస్తోంది. కొత్తగా 1.25 గిగావాట్ల సోలార్‌సెల్‌, 1.25 గిగావాట్ల మాడ్యూళ్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుపై ‘ప్రీమియర్‌’తో అజ్యూర్‌ పవర్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతిష్ఠాత్మక సంస్థలు తెలంగాణకు తరలిరావడం రాష్ట్రంలోని స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలకు నిదర్శనం. సౌరవిద్యుత్‌ రంగంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది. కొత్త పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్నవాటి ద్వారా పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. రెండు సంస్థలకూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం’’ అని తెలిపారు. తెలంగాణలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సోలార్‌ మాడ్యూల్‌, సెల్‌ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని, ఇది రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెస్తుందని అజ్యూర్‌ పవర్‌ గ్లోబల్‌ ఛైర్మన్‌ అలన్‌ రోస్లింగ్‌ తెలిపారు. తెలంగాణను సౌరవిద్యుత్‌ ఉత్పత్తుల హబ్‌గా మార్చేందుకు తమ పరిశ్రమలు సహకరిస్తాయని ప్రీమియర్‌ ఎనర్జీ ఛైర్మన్‌ సురేందర్‌పాల్‌ సింగ్‌, ఎండీ చిరంజీవ్‌ సలూజా తెలిపారు.

మెటా4 విద్యుత్‌ వాహనాల పరిశ్రమ : జహీరాబాద్‌లో అత్యాధునిక వోల్ట్‌లీ ఎనర్జీ సాంకేతిక పరిజ్ఞానంతో ద్విచక్ర విద్యుత్‌ వాహనాల పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌కు మెటా4 గ్రూప్‌ ఛైర్మన్‌ ముజిమిల్‌ రియాజ్‌ సోమవారం తెలియజేశారు. సెమీ రోబోటిక్స్‌, భారీ ఆటోమేషన్‌తో పనిచేసే ఈ పరిశ్రమను ఈ సంవత్సరాంతానికి ప్రారంభిస్తామని చెప్పారు. మొదటి దశలో ఏటా 40 వేల వాహనాల తయారీ సామర్థ్యంతో ప్రారంభించి, మూడేళ్లలో లక్ష వాహనాల తయారీకి విస్తరిస్తామని తెలిపారు. మెటా4 నిర్ణయంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ పరిశ్రమకు జహీరాబాద్‌లో 15 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. ‘‘గతిశక్తి రంగంలో తెలంగాణ వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచస్థాయి గమ్యంగా మార్చడమే మా లక్ష్యం. సంస్థకు మెగా పరిశ్రమ కింద రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 14, 2022, 3:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.