Ayyanna another tweet on Ambati: ఏపీ మంత్రివర్గంలో కాంబాబు ఎవరో జగన్ రెడ్డి త్వరలోనే చెప్తాడంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మంత్రి అంబటి రాంబాబును ట్యాగ్ చేశారు. మంత్రివర్గం నుంచి కాంబాబును త్వరలోనే బర్తరఫ్ చేయబోతున్నారంటూ.. ఇటీవల అయ్యన్న పాత్రుడు సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా.. తాజాగా మరో ట్వీట్ చేశారు.
మంత్రి ఇంటర్వ్యూ అడిగిన ఓ యూట్యూబ్ యాంకర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన మంత్రి బూతు పురాణం.. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకూ చేరిందని ట్వీట్లో అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అంతేకాదు.. సదరు యూట్యూబ్ యాంకర్ త్వరలోనే సీఎంను కలవబోతున్నారని, అప్పుడు జగనే కాంబాబు ఎవరో చెప్తారని ట్వీట్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి :