అందరికి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో తయారు చేసిన 'ఆయుర్వేదిక్ మేకిన్ ఇండియా' ఉత్పత్తులు ఎంతగానో ఉపయోగపడతాయని వెవెటోస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మెన్ డా.చల్లా తెలిపారు. లక్డీకాపుల్లోని ఓ హోటల్ జరిగిన కార్యక్రమంలో డా.చల్లా తయారు చేసిన ఉత్పత్తులపై డిస్ట్రిబ్యూటర్లకు అవహహన కల్పించారు. ఆయుర్వేద పద్దతిలో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఉత్పత్తుల ద్వారా పలు వ్యాధులను నయం చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్, అతి దీర్ఘకాయత్వం, ఎముకల బలానికి ఈ మందులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. తమ సంస్థ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ఇవీ చూడండి: 36 కౌంటింగ్ టేబుళ్లతో ఇందూరు మరో రికార్డు