గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసులకు కేంద్ర హోంశాఖ పతకాలను ప్రకటించింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు, 12 మందికి పోలీసు పతకాలు దక్కాయి.
హైదరాబాద్ కమిషనరేట్ అదనపు సీపీ శిఖా గోయల్‌కు, నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ ప్రకటించింది.
పోలీసు పతకాలకు ఎంపికైన వారిలో హైదరాబాద్ ఇంటిలిజెన్స్ ఐజీ రాజేశ్ కుమార్, డీఐజీ టీఎస్‌ఎసీపీ బెటాలియన్ షర్పుద్దీన్ సిద్దిక్కీ, పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ టి.గోవర్ధన్, నిర్మల్ డీఎస్పీ కందుకూరి నర్సింగరావు, ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ సూర్యనారాయణ, గ్రేహౌండ్స్ డీఎస్పీ జి రమేష్, హైదరాబాద్ ఇంటిలిజెన్స్ ఎస్సై బ్రుంగి గోవర్ధన్, రాచకొండ షీ టీమ్స్ ఏఎస్సై కె. కరుణాకర్ రెడ్డి, మంచిర్యాల ఎఆర్ ఎస్సై బి మోహన్ రాజు, మంచిర్యాల టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్ ఉద్దవ్, ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ మోహన్‌రెడ్డి, మహ్మద్ నయీముద్దీన్లు ఉన్నారు.
ఇవీచూడండి: కల్నల్ సంతోష్‌బాబుకు మహావీర్ చక్ర!