ETV Bharat / city

Secunderabad Riots Case: ఆవుల సుబ్బారావు అరెస్ట్​.. 14 రోజుల రిమాండ్ - four arrest in Secunderabad Riots Case

avula subbarao arrest in secunderabad riots case
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/25-June-2022/15653614_p.png
author img

By

Published : Jun 25, 2022, 12:48 PM IST

Updated : Jun 25, 2022, 1:36 PM IST

12:43 June 25

సికింద్రాబాద్ అల్లర్లలో సుబ్బారావును ప్రధాన కుట్రదారుగా తేల్చిన పోలీసులు

ఆవుల సుబ్బారావు అరెస్ట్​.. 14 రోజుల రిమాండ్

Secunderabad Riots Case: సికింద్రాబాద్​ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా మొదటి నుంచి అనుమానిస్తున్న ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్ట్​ చేశారు. అల్లర్లు జరిగిన అనంతరం పోలీసులు చేసిన దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో.. సాయి డిఫెన్స్‌ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావుతో పాటు ఈ అల్లర్లతో ప్రమేయమున్న అతడి అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

వీరిని పలుమార్లు ప్రశ్నించిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. విధ్వంసం సృష్టించాలని యువతను రెచ్చగొట్టినట్లు నిర్ధారించారు. పక్కా ప్రణాళిక ప్రకారం అల్లర్లకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు.. చివరికి రైల్వేస్టేషన్​లో విధ్వంసం జరగడానికి మూలకారణం సుబ్బారావేనని తేల్చారు.

విచారణ ముగియటంతో.. సుబ్బారావుకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుబ్బారావుతో పాటు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని పోలీసులు రైల్వేకోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో సుబ్బారావుకు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రైల్వే కోర్టు నుంచి ఈ నలుగురు నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 25, 2022, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.