వృక్షో రక్షతి రక్షితః అనే మాటకు నిదర్శనంగా నిలుస్తున్నారు రామఫణిశర్మ. మొక్కలు పెంచడం.. వాటిని నలుగురికీ పంచడం.. దేవాలయాల్లో, రోడ్డు పక్కన వేలాది మొక్కలు నాటతున్నారు. మొక్కల ఔషధ విలువలు మనిషి మనుగడకు ఎంతగానో తోడ్పడుతాయని ప్రజలకు వివరిస్తూ పర్యావరణానికి మేలు చేస్తున్నారు.
హరితమయమైన ఈ ఇల్లు ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన రామఫణిశర్మది. ఇంటి బయటే కాదు.. ఆయన ఇంట్లోనూ ఎటుచూసినా పచ్చందనమే. ఆయన కన్నా ముందు ఆయన మొక్కలు ఇంటికి వెళ్లినవారిని ముందుగా పలకరిస్తున్నట్లుంటాయి. చివరికి మిద్దెపైకి వెళ్లే మెట్లనూ ఇలా కుండీలతో నింపేశారు రామఫణి శర్మ. ఇందులో పూలు, కాయగూరలతోపాటు.. ఔషధ మొక్కలు ఉన్నాయి.
"ముఖ్యంగా మేము జీరో కాన్సెప్ట్ అనే విధానంతో మొక్కలు అందరూ పెంచుకునేలా, ఎంత ఖరీదైన మొక్కైనా సరే దాని విలువ జీరో చేసుకునే విధానంగా వాట్సప్ గ్రూపులు క్రియోట్ చేసుకున్నాం. ఇందులో జీరో బడ్జెట్ అంటే కొత్తదనం ఏమీ లేదండి. అందరూ స్నేహంతో సహకారంతో పంచుకోవడమే. ఎలాగంటే.. నేను వెయ్యి రూపాయలు పెట్టి ఒక మొక్కను తెస్తే దానిని ఎయిర్లేన్ విధానం అంటే అంటుగట్టే విధానంతో నాలుగు మొక్కలు తయారు చేసుకుంటాను. నలుగురికి కూడా నాలుగింటిని తలా ఒక రూ.250 వేసుకుని తీసుకుంటే వెయ్యి రూపాయలు పెట్టికొన్న వారికి అది జీరో అయిపోతుంది. వాళ్లకు మొక్క ఫీగా వచ్చినట్లే. వెయ్యి రూపాయల మొక్క మిగతా వాళ్లకు రూ.250కి వచ్చినట్లే. వాళ్లు అలా మళ్లీ ఓ నాలుగు అంట్లు తీసి మళ్లీ పంచిపెట్టుకోవచ్చు. అలా వాళ్లకు కూడా మొక్క జీరో అయిపోతుంది. ఈ రకంగా మూడు దఫాలకల్లా మొక్కు వాల్యూ పూర్తిగా సున్నాకు వస్తుంది. ఈ రకంగా చాలా ఖరీదైన బోన్సాయి, ఫైకస్ మైక్రోపా జాతికి చెందిన చాలా విశేషమైన ఆర్నమెంటల్ ప్లాంట్‌ను, ఎయిర్ ప్యూరిఫైర్ మొక్కలంటినీ కూడా మేము తక్కువ ధరకు వచ్చేలా ఏర్పాటు చేసుకుని గ్రూప్ మెంబర్స్ము పంచుకుంటున్నాం. ఇప్పటి వరకు నేను 90 వేలకుపైగా మెుక్కలను నాటాను. నేను స్వయంగా గత రెండేళ్లుగా 10 వేల మొక్కలు పంపిణీ చేశాను." -రామఫణిశర్మ, సిద్ధాంతి
రామఫణిశర్మ ఇంటి విస్తీర్ణమే సెంటుంపావు.. అంటే 60 చదరవు గజాలు. అందులోనే ఆయన 11వందల రకాల మొక్కలు పెంచుతున్నారంటే మొక్కలపై ఆయనకున్న మమకారం ఏంటో అర్థంచేసుకోవచ్చు. తన అభిరుచిని అందరూ అలవాటు చేసుకోవాలని పరితపిస్తున్నారు ఫణిశర్మ. ఇందుకోసం.. హరితవనం వాట్సప్ గ్రూపు ఏర్పాటుచేశారు. అందులో మొక్కల గురించి సమాచారం ఇస్తుంటారు. ఇతరులకూ తన పెరట్లోని మొక్కలు పంచుతారు. రహదారుల పక్క, దేవాలయాల ఖాళీ స్థలాల్లో వాటిని నాటితో సంతోషిస్తారాయన. అలా లక్ష వరకు మొక్కలు నాటామని చెప్తున్నారు రామఫణిశర్మ. అరుదైన మొక్కలను కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపైనా ఉందంటున్నారు.
ఇవీ చదవండి: Khairtabad Ganesh : భాగ్యనగరంలో గణేశుడి సందడి.. ఖైరతాబాద్‌లో భక్తుల కిటకిట
Ganesh Chathurthi: గణేశునిలోని ప్రత్యేకమైన గుణాలేంటో తెలుసా?