ETV Bharat / city

RICE: ఆ బియ్యం కథ కంచికేనా.. ఇంకా అందని 65 వేల మెట్రిక్‌ టన్నులు.. - pds rice

రాష్ట్రంలోని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించిన బియ్యాన్ని అధికారులు మూడేళ్లుగా రాబట్టలేకపోయారు. 2019-20 యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐ(FCI)కి సరఫరా చేసేందుకు మిల్లర్లకు ప్రభుత్వం ఇవ్వగా.. వాటిలో 1.01 లక్ష మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తిరిగి ఇవ్వకపోవడం గమనార్హం.

rice
rice
author img

By

Published : Feb 8, 2022, 5:54 AM IST

రాష్ట్రంలోని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించిన బియ్యాన్ని అధికారులు మూడేళ్లుగా రాబట్టలేకపోయారు. 2019-20 యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐ(FCI)కి సరఫరా చేసేందుకు మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చింది. వాటిలో 1.01 లక్ష మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 102 మంది మిల్లర్లు తిరిగి ఇవ్వలేదు.

మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులను ఆదేశించింది. మిల్లుల్లో సింహభాగం బియ్యం, ధాన్యం నిల్వలు లేవని వారు నిర్ధారించారు. అనంతరం బియ్యంపై 25 శాతం అపరాధ రుసుముతో వసూలు చేయాలని డిసెంబరు 7న పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులిచ్చింది.

తర్వాత మిల్లర్లు 36 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఇంకా 65 వేల ఎంటీలు ఇవ్వకపోవడం గమనార్హం. అత్యధికంగా పెద్దపల్లి, వరంగల్‌, హనుమకొండ, జగిత్యాల, ములుగు, వనపర్తి, మంచిర్యాల, జనగామ జిల్లాల నుంచి భారీగా బియ్యం అందాలి.

ఇదీ చూడండి: గురుకుల రత్నాలు.. తొలివిడత కౌన్సెలింగ్‌లో 190 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.