ETV Bharat / city

రూ.3 కోట్ల రోడ్డు .. మూడు నెలల ముచ్చట

author img

By

Published : Nov 6, 2020, 7:02 AM IST

ప్రస్తుతమున్న రోడ్లపై రద్దీ తగ్గించి వేగంగా బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) పైకి వెళ్లేందుకు ఉపయోగపడే కీలకమైన రహదారి అది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో కొత్తగా నిర్మించిన లింకు రోడ్డు మూసీ వరదల వల్ల కొన్ని చోట్ల కొట్టుకుపోగా అనేక చోట్ల బీటలు వారింది. రాకపోకలు నిలిపివేయడంతో వేలాది మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుత్తేదారు నాణ్యత ప్రమాణాలతో నిర్మించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు. హైదరాబాద్ అత్తాపూర్‌ నుంచి మూసీ వెంట బాపూఘాట్‌ వరకు నిర్మించిన రోడ్డు పరిస్థితి ఇది.

Attapur-Bapughat link road is damaged
కోతకు గురైన అత్తాపూర్‌- బాపూఘాట్‌ రహదారి

రాజధానిలో కొన్ని కీలకమైన లింకు రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కిందటే పచ్చజెండా ఊపింది. నగరంలో 250 రోడ్లను రూ.250 కోట్లతో నిర్మించాలని హైదరాబాద్‌ రోడ్ల అభివృద్ధి సంస్థ(హెచ్‌ఆర్‌డీసీ) తలపెట్టింది. 50 పూర్తయ్యాయి. లింకు రోడ్ల వల్ల దూరం తగ్గిపోయి తక్కువ సమయంలో వాహనదారులు గమ్యస్థానాలకు చేరుతున్నారు. అత్తాపూర్‌ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే వంతెన 118 స్తంభం నుంచి మొదలై, మూసీ ఆనుకొని ఉన్న రోడ్డు బాపూఘాట్‌ వరకు ఉంది. బాపూఘాట్‌ వంతెన నుంచి అత్తాపూర్‌ వైపు అర కి.మీ. రోడ్డు ఇప్పటికీ వేయలేదు. మూసీ కొంత భాగాన్ని పూడ్చి ఈ లింకు కలిపితే ప్రయోజనం ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. పరిశీలించిన మంత్రి కేటీఆర్‌ తక్షణం నిర్మాణాన్ని పూర్తి చేయమని ఆదేశించారు.

రూ.3.40 కోట్ల వ్యయమయ్యే ఈ రోడ్డు నిర్మాణానికి హెచ్‌ఆర్‌డీసీఎల్‌ అధికారులు ఏడాది కిందట టెండరు పిల్చి గుత్తేదారుకు అప్పగించారు. మూడు నెలల కిందట నిర్మాణం పూర్తికావడంతో వాహనాలను అనుమతించారు. దీనివల్ల అత్తాపూర్‌ నుంచి బాపూఘాట్‌ వంతెన దాటి నేరుగా నార్సింగి మీదుగా ఓఆర్‌ఆర్‌, మరోవైపు చిలుకూరు వైపు వెళ్లడానికి అవకాశం ఏర్పడింది. మూడు నాలుగు కి.మీ. తిరిగి వెళ్లాల్సిన బాధ తప్పింది. ఇటీవల హిమాయత్‌సాగర్‌ నుంచి నీళ్లు వదలడంతో మూసీలోకి వేలాది క్యూసెక్కులు ప్రవహించాయి.

ఉన్నత ప్రమాణాలతో మట్టికట్ట నిర్మించి దానిపై తారు రోడ్డు వేసి ఉంటే మూసీకి ఎంత వరద వచ్చినా కొత్త రోడ్డుకు ఏమయ్యేది కాదు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వరద నీటికి కొత్త రోడ్డు రెండు చోట్ల చాలా భాగం కోతకు గురైంది. మరికొంత భాగం బీటలు వారింది. వాహనాలు వెళితే మూసీలోకి జారిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రమాదకరమైన రోడ్డని బ్యానర్‌ పెట్టిన అధికారులు, వాహనాలను నిషేధించారు. నిర్మాణం సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపించిందని, మట్టికట్టను సరిగా రోలింగ్‌ చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గుత్తేదారుతో తిరిగి రోడ్డును నిర్మింపజేస్తాం

మూసీ వరద నీరు వేగంగా కట్టకు తగలడంతోనే కొన్ని చోట్ల కొట్టుకుపోయింది. తిరిగి నిర్మించే బాధ్యత గుత్తేదారుదే. అతనితోనే రోడ్డును పూర్తి ప్రమాణాలతో నిర్మింప జేస్తాం.

- సర్దార్‌సింగ్‌, ఈఈ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.