Assistive Devices Summit: వరల్డ్ బ్రెయిలీ డే సందర్భంగా అసిస్టివ్ టెక్నాలజీ సమ్మిట్ లో భాగంగా... తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ సంయుక్తంగా ప్రదర్శనను ఏర్పాటు చేసింది. గతేడాది పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన అసిస్టివ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ విజయవంతమవ్వటంతో.. అసిస్టివ్ టెక్నాలజీ 2.0 ను హైదరాబాద్ ముకఫంజా కళాశాలలో టీఎస్ఐసీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు... మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ కమిషనర్ శైలజా సజ్జా.. ఛైర్మన్ వాసుదేవ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లన్నింటినీ కలియతిరిగి... ఆవిష్కరణలను పరిశీలించారు. ఈ ఎగ్జిబిషన్ లో అసిస్టివ్ టెక్ ఫౌండేషన్, యూత్ ఫర్ జాబ్స్... బీవీఆర్ఐటీ హైదరాబాద్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్... అన్ ముక్త్ వంటి పలు స్టార్టప్ లు, ఎన్జీవోలు, జాతీయ స్థాయి సంస్థలు పాల్గొని... తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి.
గతేడాది ప్రదర్శన కన్నా.. ఈసారి ఎగ్జిబిషన్‌ను వినూత్నంగా నిర్వహిస్తూనే, టాప్ మూడు ఆవిష్కరణలకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పదినెలల వయస్సున్న పసిపిల్లల ఏడుపుకు కారణాలను తెలిపే టెక్నాలజీకి... మొదటి బహుమతి, ఐవీటీ టెక్నాలజీని ఉపోయోగించి స్మార్ట్ ఫాబ్రిసియాకు రెండో బహుమతి... మయో ఎలక్ట్రిక్ చేతిని రూపొందించిన స్టార్టప్ కు మూడో బహుమతులను అతిథులు అందజేశారు. ఆవిష్కరణ ఫలాలు దివ్యాంగులకు సైతం అందినప్పుడే... వాటికి మరింత విలువ చేకూరుతుందని.. టీఎస్ఐసీ ఛీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం తెలిపారు.
దివ్యాంగులకు ఉపయోగపడే ఆవిష్కరణలను … రూపొందించిన పలువురు విద్యార్థుల ప్రతిభను.. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదీ చూడండి: