ETV Bharat / city

కూకట్​పల్లిలో ఆసరా ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు

Asara pension నూతన ఆసరా ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూకట్​పల్లి నియోజకవర్గంలో నిర్వహించారు. ఓల్డ్ బోయినపల్లిలో జరిగిన ఈ వేడుకలో సుమారు 1300మందికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫించన్లు పంపిణీ చేశారు.

author img

By

Published : Sep 6, 2022, 6:29 PM IST

asara pension Distribution
ఆసరా ఫించన్ల పంపిణీ

Asara pension: కూకట్​పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లిలో నూతన ఆసరా ఫించన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన 1300 మంది లబ్ధిదారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫించన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రతి డివిజన్​లోనూ ఇదే విధంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసి వారికి పింఛన్లు అందిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో ప్రగతి సాధించిందన్నారు. అలాగే అన్ని పథకాలకు అర్హులైన వారందరికీ ఇంకా ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతాయో అనే దానిపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఇంటికి మంచి నీరు, 24 గంటలు విద్యుత్, శాంతిభద్రతలు, నిరుపేదల ఆడపిల్లల కోసం కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి అనేక పథకాలు తీసుకోచ్చారని చెప్పారు. అలాగే రైతులకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులైన అందరికీ కేటాయిస్తామన్నారు. ఇందులో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా కేవలం లాటరీ సిస్టం ద్వారా మాత్రమే లబ్ధిదారులుని ఎంపిక చేస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణంలో మధ్యవర్తులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసిన, ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దన్నారు. అలా అడిగిన వారి గురించి తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఆసరా ఫించన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారావు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.