దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్‌గా అరుణ్ కుమార్ జైన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వేల్లో పలు కీలక విభాగాల్లో ఆయన పని చేశారు. రీసెర్చ్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్‌డీఎస్‌ఓ)లోనూ విధులు నిర్వర్తించారు.
డిజిటల్ యాక్సిల్ కౌంటర్స్, సాలిడ్ స్టేట్ బ్లాక్, ట్రైన్ ప్రొటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్(టీపీడబ్ల్యూఎస్), ట్రైన్ కొల్యూజన్ అవాయిడెన్స్ సిస్టమ్(టీకాస్) వంటి అడ్వాన్స్ సిగ్నలింగ్ సిస్టమ్స్‌లో అరుణ్ కుమార్ జైన్ కీలక పాత్రను పోషించారు. రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా, గ్రూప్ జనరల్ మేనేజర్‌గా జైన్ పనిచేశారు.
ఇదీ చూడండి: 10నెలల్లో 200 మంది ఉగ్రవాదుల ఏరివేత