ETV Bharat / city

'అమరావతి'పై వాదనలు...ఆర్థిక, గణాంకాల శాఖకు హైకోర్టు నోటీసులు - 'అమరావతి'పై వాదనలు కోర్టులో వాదనలు

ఆర్థిక, గణాంకాల శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీలో 3 రాజధానుల నిర్ణయంతో జరిగిన ఆర్థిక నష్టం వివరాలు కోరుతూ రాజధాని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ మేరకు హైకోర్టు నోటీసులిచ్చింది. మరికొన్ని కీలక పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ చేపట్టనుంది.

amaravathi
'అమరావతి'పై వాదనలు...ఆర్థిక, గణాంకాల శాఖకు హైకోర్టు నోటీసులు
author img

By

Published : Oct 8, 2020, 9:50 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన వ్యాజ్యంలో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌ను ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌కు నోటీసులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇప్పటి వరకు చేసిన ఖర్చుపై...నివేదిక సమర్పించేలా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌ని ఆదేశించాలని కోరుతూ...రాజధాని రైతు ఇడుపులపాటి రాంబాబు మరికొందరు అనుబంధ పిటిషన్ వేశారు. రాజధానితో ముడిపడి ఉన్న ప్రధాన వ్యాజ్యాల్లోని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే. మహేశ్వరి, జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం అంశాల వారీగా విచారణ కొనసాగించింది. మరికొన్ని వ్యాజ్యాలను సోమవారానికి వాయిదా వేసింది. సీఎం క్యాంప్ కార్యాలయం సహా పలు ఇతర అంశాలపై గురువారం విచారణ జరపాల్సి ఉండగా ..వాటినీ సోమవారమే విచారిస్తామని స్పష్టం చేసింది.

ప్రాంతీయ అసమానతలు వస్తాయి....

మరోవైపు... పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తమను ప్రతివాదులుగా చేర్చుకొని వాదనలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలంటూ రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన వారు వేసిన అనుబంధ పిటిషన్లపైనా త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సీఆర్డీఏ చట్టం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాతినిథ్యం ఇవ్వడం లేదన్న పిటిషనర్లు..3 ప్రాంతాలూ అభివృద్ధి చెందకపోతే ప్రాంతీయ అసమానలు వస్తాయన్నారు. అందువల్లే ప్రస్తుత ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇపుడు ఆ చట్టాలను కోర్టు రద్దు చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇంప్లీడ్ పిటిషన్లను అనుమతించాలని కోరారు.

ఇంప్లీడ్ పిటిషన్​పై ఉత్తర్వులు అవసరం లేదు

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను మండలి ఛైర్మన్ సెలెక్టు కమిటీకి సిఫారసు చేసినా విషయాన్ని నోటిఫై చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గతంలో వ్యాజ్యం దాఖలు చేశారు. బిల్లుల్ని సెలెక్టు కమిటీకి పంపుతూ మండలి చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీ రఘువర్మ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాల్నీ కలిపి విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. ఎమ్మెల్సీ రఘువర్మ.. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యాజ్యంలో వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. రాజధాని వ్యాజ్యాల్లో కొన్ని దస్త్రాలు కోర్టు ముందు ఉంచేందుకు అనుమతించాలని పలువురు వేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. విచారణ తొందరగా నిర్వహించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలు వ్యర్థమని తెలిపింది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న విషయాన్ని గుర్తు చేసింది. సీఎం జగన్‌, మంత్రులు బొత్స, బుగ్గన సహా మరికొందరిని ఓ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

పిటిషనర్ ఎం. రమేశ్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు కౌంటర్ వేసేందుకు గడువు కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. ప్రధాన వ్యాజ్యాలను అంశాల వారీగా విభజించే ప్రక్రియను ఏజీ కార్యాలయం, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చేపడితే విచారణకు సౌలభ్యంగా ఉంటుందని ధర్మాసనం సూచించగా.. అందుకు న్యాయవాదులు అంగీకరించారు.

ఇదీ చదవండి: రాజధానిలో భూమి లేని పేదలకు పెన్షన్లు.. అనుమతులు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.