ETV Bharat / city

ఏపీపీఎస్సీ గ్రూప్​-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా - ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2019 న్యూస్

ఏపీపీఎస్సీ గ్రూప్​-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

appsc-group-1-mains-postponed
ఏపీపీఎస్సీ గ్రూప్​-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా
author img

By

Published : Oct 22, 2020, 10:44 PM IST

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 2 నుంచి 13 వరకు పరీక్షలు నిర్వహించేలా గతంలో షెడ్యూలు విడుదలైంది. కానీ హైకోర్టు ఆదేశాలతో పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రూప్-1 మెయిన్స్ కొత్త షెడ్యూల్​ను ఈనెల 29న ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.

గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలో తప్పులున్నాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ ప్రశ్నలను తొలగించకుండానే మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు కోర్టుకు తెలిపారు. గ్రూప్- 1 ప్రాథమిక పరీక్ష పత్రంలో తప్పులు దొర్లడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని కోర్టుకు వివరించారు. వ్యాజ్యంపై వాదనలు విన్న హైకోర్టు.. పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఈ ఆదేశాలతో మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు మార్గం సుగమం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.