ETV Bharat / city

ap erc: స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లపై.. ఏపీఈఆర్సీ నోటిఫికేషన్ - విద్యుత్ కొనుగోళ్లు తాజా వార్తలు

aperc notification on short term power purchases: స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. స్వల్పకాలిక కొనుగోళ్లకు చెందిన రియల్ టైమ్, ఇంట్రాడే, ఒక రోజు ముందస్తు అంచనాలు, వారం, నెలరోజులకు సంబంధించిన కొనుగోళ్ల అంచనాల వివరాలను ఎప్పటికప్పుడు ఈఆర్సీకి తెలియచేయాలని స్పష్టం చేసింది.

ap erc
ap erc
author img

By

Published : Feb 10, 2022, 11:40 PM IST

aperc notification on short term power purchases: రాష్ట్రంలో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి విద్యుత్ సంస్థలు చేపట్టే స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు ఈఆర్సీ నియంత్రణలోనే చేపట్టాలని తేల్చి చెప్పింది. స్వల్పకాలిక కొనుగోళ్లకు సంబంధించి రియల్ టైమ్, ఇంట్రాడే, ఒక రోజు ముందస్తు అంచనాలు, వారం, నెలరోజులకు సంబంధించిన కొనుగోళ్ల అంచనాల వివరాలను ఎప్పటికప్పుడు ఈఆర్సీకి తెలియచేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సాయంతో స్టేట్​లోడ్ డిస్పాచ్ సెంటర్ వీటిని అంచనా వేయాలని స్పష్టం చేసింది. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ల యూనిట్ ధర బెంచ్ మార్క్ ధరకన్నా అధికంగా ఉంటే.. డిస్కమ్​లే భరించాలని ఈఆర్సీ స్పష్టం చేసింది.

విద్యుత్ కొరతను తీర్చేందుకు అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నందున యూనిట్ ల్యాండింగ్ కాస్ట్​పై ప్రస్తుతానికి ఎలాంటి మార్గదర్శకాలూ ఇవ్వలేమని వెల్లడించింది. బహిరంగ మార్కెట్​లో అధిక ధరల్ని చెల్లించి విద్యుత్​ను కొనుగోలు చేస్తున్న కారణంగా వినియోగదారులపై భారం పడుతోందని విద్యుత్ నియంత్రణ మండలి అభిప్రాయపడింది. అత్యవసర కొనుగోళ్ల కారణంగా ప్రతి యూనిట్ కొనుగోలు ధరపైనా ప్రభావం పడుతోందని స్పష్టం చేసింది. యూనిట్ ధరతోపాటు ట్రాన్స్ మిషన్ డీవియేషన్ ఛార్జీలుగా అదనంగా యూనిట్​కు రూ.25 పైసలు చెల్లించాల్సి వస్తోందని ఈఆర్సీ పేర్కొంది.

రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయటం ద్వారా నిర్వహణా లోపాలు, మరమ్మతులకు అధిక వ్యయం చేయాల్సి వస్తోందని ఈఆర్సీ స్పష్టం చేసింది. సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్​ల ద్వారా వచ్చే ఉత్పత్తి నిరంతరం ఒ‍కేలా ఉండకపోవటం వల్ల గ్రిడ్​పై భారం పడుతోందని ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. ఫలితంగా బహిరంగ మార్కెట్ నుంచి స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొందని నోటిఫికేషన్​లో పేర్కొంది. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కమ్​లు చేసుకునే ఒప్పందాలను నెల రోజులు ముందుగా తెలియచేయాలని ఈఆర్సీ వెల్లడించింది.

ఇదీ చదవండి: టికెట్‌ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నాం: చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.