ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.
కేబినెట్ చర్చించిన అంశాలు:
- 25 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చ
- జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ ఏర్పాటు
- వైఎస్‌ఆర్ చేయూత పథకం అమలు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆర్థికసాయం
- మనబడి, నాడు-నేడులో సవరించిన మార్గదర్శకాలపై చర్చ
పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదంపై కేబినెట్ చర్చించింది.ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం, 2020 ను రూపొందించడంతో పాటు
కడపజిల్లాల గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ పరిధిలోని రైతులకు పరిహారం అందించడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
ఇదీ చూడండి : గాంధీ భవన్కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత