ETV Bharat / city

ఏపీ అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం: ఎస్‌ఈసీ

ఏపీ అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలని ఆర్డినెన్స్ తెస్తే తిరస్కరించాలని లేఖలో కోరారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

nimmagadda ramesh kumar
nimmagadda ramesh kumar
author img

By

Published : Dec 5, 2020, 8:12 PM IST

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​‌కు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ లేఖ రాశారు. స్థానిక ఎన్నికల నిర్వహణ గురించి అసెంబ్లీ తీర్మానంపై లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 243కె అధికరణ కింద ఈసీకి స్వయం ప్రతిపత్తి ఉందన్న ఎస్‌ఈసీ... ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరపడం కమిషన్ విధి అని గుర్తు చేశారు.

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు సమాన అధికారాలు ఉన్నాయన్న ఎస్‌ఈసీ... ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలని ఆర్డినెన్స్ తెస్తే తిరస్కరించాలని లేఖలో కోరారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: భాజపాలోకి వలసలు: రాములమ్మ ఓకేనట.. జానా డౌటేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.