ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశానికి ఏపీ సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు పలు జిల్లాలకు చెందిన అధికారులు హాజరు కాలేదు.
సర్వత్రా ఆసక్తి...
మరోవైపు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సాయంత్రం 5 గంటల వరకు అధికారులకు ఏపీ ఎస్‌ఈసీ సమయం ఇచ్చింది. గైర్హాజరైన అధికారులపై ఆ రాష్ట్ర ఈసీ ఏం చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అధికారుల సహాయ నిరాకరణ అంశాన్ని ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అధికారుల సహాయ నిరాకరణతో ఈసీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.
- ఇదీ చదవండి : అడవికి ఆమెతోనే అభయం.. అక్రమార్కులకు ఆమంటే భయం!