ETV Bharat / city

Krishna River board: కృష్ణా యాజమాన్య బోర్డుకు ఏపీ ఈఎస్​సీ లేఖ

కృష్ణా బోర్డుకు ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శకి లేఖ రాశారు. రాయసీమలో తాగు, సాగు నీటి అవసరాలకు, చెన్నై తాగు నీటి అవసరాలకు 27 టీఎంసీలు అవసరమని.. ఈ నీరు తీసుకునేందుకు అనుమతివ్వాలని లేఖలో కోరారు.

author img

By

Published : Jul 25, 2021, 10:11 AM IST

ap-request-krishna-river-board-for-27-tmc-water
కృష్ణా యాజమాన్య బోర్డుకు ఏపీ ఈఎస్​సీ లేఖ

ఏపీలోని రాయలసీమలో తాగు, సాగు నీటి అవసరాలకు, చెన్నై తాగునీటి అవసరాలకు 27 టీఎంసీలు అవసరమని, ఈ నీరు తీసుకునేందుకు అనుమతివ్వాలని రాష్ట్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి. నారాయణరెడ్డి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి శనివారం లేఖ రాశారు. చెన్నై తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు, తెలుగుగంగ కింద 7 టీఎంసీలు, గాలేరు-నగరి-ఎస్‌ఆర్‌బీసీకి 8 టీఎంసీలు, కేసీ కాలువ కింద 2 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి కింద 7 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. ఆ లేఖలో ఈఎన్‌సీ ఇంకా ఇలా రాశారు.

తెలంగాణ 82.40 టీఎంసీల వినియోగం

  • తెలంగాణ ఇప్పటికే 82.40 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. శ్రీశైలం నుంచి 43.25 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ నుంచి 27.23 టీఎంసీలు, పులిచింతల నుంచి 11.92 టీఎంసీలు విద్యుత్తు వినియోగం కోసం ఏకపక్షంగా వాడేసింది. దిగువన ఎలాంటి సాగునీటి, తాగునీటి అవసరాలు, డిమాండ్‌ లేకముందే ఈ నీటిని వాడుకుంది. కృష్ణా బోర్డు నుంచి అనుమతి లేకుండా, వారికి తెలియజేయకుండా వినియోగించుకుంది.
  • తెలంగాణ వినియోగించుకున్న ఈ 82.40 టీఎంసీలను ఆ రాష్ట్రానికి ఉన్న 299 టీఎంసీల నుంచి మినహాయించాలి. కృష్ణాలో నీటిని ఏపీ, తెలంగాణలు 66.34 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. ఆ లెక్కన ఇప్పటికే తెలంగాణ ఎలాంటి అనుమతి లేకుండా వినియోగించిన 82.40 టీఎంసీలకు సరిసమానంగా ఏపీ 160 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది.
  • ప్రస్తుతం శ్రీశైలం జలాశయం 853.70 అడుగుల వద్ద 88.47 టీఎంసీలతో ఉంది. నాగార్జున సాగర్ వద్ద 536.50 అడుగుల వద్ద 181.11 అడుగుల నీటి నిల్వ ఉంది. పులిచింతల జలాశయంలో 173.718 అడుగుల వద్ద 43.79 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు తెలంగాణలోని జూరాల , ఏపీలోని ప్రకాశం బ్యారెజీలో నీరు నిండి మిగులు జలాలను దిగువకు వదిలేస్తున్నారు. మరో నాలుగు లక్షల ప్రవాహాల క్యూసెక్కులు రాబోతున్నాయి. అందువల్ల రాయలసీమకు నీటిని విడుదల చేసేందుకు అనుమతివ్వాలి.

ఇదీ చూడండి: సమయానికి రమ్మన్నారని.. ప్రధానోపాధ్యాయురాలిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.