ETV Bharat / city

VACCINE RECORD: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు - AP News

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 9 లక్షల నుంచి 10 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులు వేయాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలో మాస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇవాళ ఒక్కరోజే 11.85 లక్షల మందికి టీకాలు ఇచ్చినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు.

ఒక్కరోజే 11.85 లక్షల మందికి టీకాలు
ఒక్కరోజే 11.85 లక్షల మందికి టీకాలు
author img

By

Published : Jun 20, 2021, 7:36 PM IST

Updated : Jun 20, 2021, 7:43 PM IST

కరోనా టీకాల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్​ కొత్త రికార్డు నెలకొల్పినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఒకేరోజు అత్యధికంగా ఆ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగింది. 'వాక్సిన్‌ సండే' పేరిట నిర్వహించిన మెగాడ్రైవ్‌లో ఇవాళ ఒక్కరోజే సుమారు 13 లక్షల మందికి టీకాలు వేశారు. గతంలో ఒకేరోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చిన రికార్డును ఏపీ ప్రభుత్వం అధిగమించింది.

2232 కేంద్రాలు

ఉదయం నుంచి సాయంత్రం వరకు టీకాల ప్రక్రియ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో 2232 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోన్న ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది టీకా డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకున్నారు. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది నుంచి పది లక్షల మందికి టీకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.

ముందస్తుగానే జిల్లాలకు టీకాల పంపిణీ

ఒకేరోజు భారీ సంఖ్యలో టీకాలు వేయించేందుకు తమ వద్ద పటిష్టమైన వ్యవస్థ, సమర్ధత ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా ఎక్కువ మోతాదులో టీకాల కేటాయింపు జరిపేందుకు వీలుంటుంనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అందుకు అనుగుణంగానే వైద్య ఆరోగ్యశాఖ ముందస్తుగానే టీకాలను ఆయా జిల్లాలకు పంపించింది. ప్రతి జిల్లాలోనే గరిష్టంగా ఐదు వందల కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. మధ్యాహ్నం సమయానికే ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించిన లక్ష్యం పూర్తి చేసింది.

పిల్లల తల్లులకూ వ్యాక్సినేషన్​

వాలంటీర్ల ద్వారా స్లిప్లులను అర్హులైన వారి ఇంటికి పంపించి- వారంతా టీకాలు వేయించుకునేందుకు వచ్చేలా అవగాహన కలిగించింది. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. 45 ఏళ్లు పైబడిన వారికి తొలి డోస్‌తోపాటు అర్హులైన వారికి రెండో డోస్‌ టీకాలు అందించారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1.43 లక్షలు. కృష్ణా జిల్లాలో 1.31 లక్షల మందికి, విశాఖ జిల్లాలో 1.10 లక్షల మందికి, గుంటూరు జిల్లాలో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు.

మూడో వేవ్ వచ్చినా...

రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు బాగా తగ్గిందని ఏపీ ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్​కుమార్ సింఘాల్ తెలిపారు. సుమారు 45 వేల మంది హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారన్న ఎ.కె.సింఘాల్‌... మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో పీయూసీ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేస్తామని... డి-టైప్ సిలిండర్లు 10 వేలు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ప్రతి ఆస్పత్రిలో 10 కేఎల్‌ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు నిర్మిస్తామని సింఘాల్‌ వివరించారు.

ఇదీ చదవండి: KTR:హైదరాబాద్​లో వ్యాక్సిన్​ టెస్టింగ్​ సెంటర్​ ఏర్పాటుచేయండి: కేటీఆర్​

Last Updated : Jun 20, 2021, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.