ETV Bharat / city

AP DGP: మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైంది.! - ఏపీలో మావోయిస్టులు అరెస్ట్

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందన్న డీజీపీ.. గత రెండేళ్లుగా అనేక సంక్షేమ పథకాలు గిరిజనులకు అందుతున్నాయని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోని భూ సమస్యలనూ ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందని చెప్పారు.

maoists arrested
మావోయిస్టులు అరెస్ట్​
author img

By

Published : Aug 12, 2021, 2:50 PM IST

మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. ఏవోబీ సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో.. అమరావతిలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆయన ప్రకటించారు.

గత రెండేళ్లుగా గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని డీజీపీ చెప్పారు. గిరిజనులకు 3లక్షల ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని.. సుమారు 20వేల మందికి పట్టాలు ఇచ్చిందని వివరించారు. తద్వారా మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందని డీజీపీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: R.Narayana Murthy : 'రైతన్న'.. కర్షకుడి కష్టాన్ని చూపే సినిమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.