ETV Bharat / city

New ministers visit temple: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న కొత్త మంత్రులు - AP New ministers visit indrakeeladri latest news

New ministers visit temple: కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన పలువురు ఏపీ మంత్రులు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కొత్త మంత్రులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో దర్శన ఏర్పాట్లు చేశారు.

New ministers visit temple
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కొత్త మంత్రులు
author img

By

Published : Apr 11, 2022, 5:42 PM IST

New ministers visit temple: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని పలువురు కొత్త మంత్రులు దర్శించుకున్నారు. ఇవాళ ఏపీలో మంత్రులుగా ప్రమాణం చేసిన రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బుగ్గన రాజేంద్ర నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో కొత్త మంత్రులకు స్వాగతం పలికిన ఈవో వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. వేద పండితులు కొత్త మంత్రులకు ఆశీర్వచనాలు అందించారు.

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న కొత్త మంత్రులు

సీఎం జగన్ అధికారం చేపట్టిన మూడేళ్లకు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఏపీ కేబినెట్​లో 25 మంది మంత్రి పదవులు దక్కించుకున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆర్కే రోజా కుటుంబసమేతంగా అమ్మవారిలో సేవలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కారుమూరి నాగేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడుతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మరో మంత్రి నారాయణస్వామి కూడా దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కేబినెట్​లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. మంత్రులకు శాఖల కేటాయింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.