ETV Bharat / city

AP POLITICS: 'రాజకీయాల గురించి మాట్లాడకుండా సినిమాలు చేసుకుంటే మంచిది' - darmana krishna das comments on pawan news

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ను విమర్శించే స్థాయి జనసేన అధినేత పవన్​కు లేదని ఏపీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పవన్ రాజకీయాల గురించి మాట్లాడకుండా సినిమాలు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

AP POLITICS
AP POLITICS
author img

By

Published : Aug 27, 2021, 6:45 PM IST

ఆంధ్రప్రదేశ్​ భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉన్న ముఖ్యమంత్రి జగన్​ను విమర్శించే స్థాయి జనసేన అధినేత పవన్​కు లేదని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలోనూ పవన్ గెలవలేక పోయారని ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయాల గురించి మాట్లాడకుండా సినిమాలు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

AP POLITICS: 'రాజకీయాల గురించి మాట్లాడకుండా సినిమాలు చేసుకుంటే మంచిది'

"పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన మంచి నాయకుడు. ఆయన రాజకీయాల్లో కంటే సినిమాల్లో ఉంటేనే బాగుంటుంది. వ్యక్తిగతంగా పవన్ అంటే నాకూ ఇష్టమే. చక్కగా ఫైట్ చేస్తాడు, డైలాగులు చెబుతాడు. కానీ..రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సీఎం జగన్​తో పోల్చుకోవద్దని ఓ శ్రేయోభిలాషిగా పవన్​ను కోరుతున్నా. ముఖ్యమంత్రి జగన్​ను విమర్శించే స్థాయి పవన్​కు లేదు. జగన్​కు జగనే సాటి. రాష్ట్ర ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి​. సీఎం జగన్​ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందనేది నా హితవు."- ధర్మాన కృష్ణదాస్, ఏపీ ఉపముఖ్యమంత్రి.

కొవిడ్ సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల నకిలీ చలానాల అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని ధర్మాన అన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. ఈ వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా రూ.7 కోట్ల అవకతవకలు జరగ్గా...ఇప్పటికే రూ. 3 కోట్లు రికవరీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: REVANTH REDDY: 'మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై ఆధారాలున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.