ఆంధ్ర ప్రదేశ్లోని ఎన్టీఆర్ వర్సిటీలో మెడికల్ పీజీ సీట్ల కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. సీట్ల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు.
హైలెవల్ కమిటీ ఏమైంది..?
విచారణ సందర్భంగా వర్శిటీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు, మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఎలా సీట్లు కేటాయిస్తారని ప్రశ్నించింది. ప్రతిసారి మెడికల్ సీట్ల కేటాయింపుపై హైకోర్టుకు వస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. గతంలో దీనిపై కోర్టు ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ ఏమైందని వ్యాఖ్యానించింది.
కమిటీ సిఫార్సులపై ఏం చర్యలు తీసుకున్నారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇలా సీట్ల కేటాయింపు సరికాదని ఒక దశలో ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనిపై కొంత సమయం కావాలని వర్శిటీ తరపు న్యాయవాది కోర్టును కోరగా.. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'