ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన విషయంలో పోలీసులు తొందరపడవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏబీ వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో పోలీసులు తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని, ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి : ముచ్చటగా మూడోసారి డ్రైరన్..