ETV Bharat / city

సీబీఐకి ఏపీ న్యాయమూర్తులపై సోషల్ మీడియా వ్యాఖ్యల కేసు - ap high court updatse

న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యల కేసును ఏపీ హైకోర్టు విచారించింది. ఈకేసులో సీఐడీ విచారణ పట్ల న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న నాయస్థానం... 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది.

ap high court
ap high court
author img

By

Published : Oct 12, 2020, 4:14 PM IST

న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యల కేసును సీబీఐకి ఏపీ హైకోర్టు అప్పగించింది. ఈ కేసుపై విచారణ జరిగిన న్యాయస్థానం సీఐడీ దర్యాప్తు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్ఐ​ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశించిన హైకోర్టు... 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.

ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పేరును కేసులో చేర్చాలని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారి వివరాలు సీబీఐకి ఇవ్వాలని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఇవాళ విచారణలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి : న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించారా?.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.