AP High Court on PRC: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచీ రికవరీ చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్‌ను చేర్చారు. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
- ఇదీ చదవండి : Lack of protection for handloom storage: వస్త్రానికి రక్షణ కరవు.. గోదాముల్లో పేరుకుపోతున్న కానుకలు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం