ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ - ఏపీ ఎన్నికల వార్తలు

ap high court on panchayath elections
పంచాయతీ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌
author img

By

Published : Jan 21, 2021, 10:45 AM IST

Updated : Jan 21, 2021, 11:42 AM IST

10:43 January 21

పంచాయతీ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఏపీ ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను ఆంధ్రప్రదేశ్​ ఉన్నత న్యాయస్థానం అనుమతించింది.

ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించింది.

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు..

షెడ్యూల్ ప్రకారమే యథావిధిగానే ఎన్నికలు జరుగుతాయని ఏపీ ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంది. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపినట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించింది. 

ఇవీచూడండి: మే 3 నుంచి ఇంటర్​ పరీక్షలు..!

Last Updated : Jan 21, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.