ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేతకు.. ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. కరోనా కారణంగా గతంలో నిలిచిన పంచాయతీ ఎన్నికలను.. ఫిబ్రవరిలో నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది.
కరోనా ప్రభావం ఇంకా తొలగని కారణంగా నిర్వహణ సాధ్యపడదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ విషయమై విచారణ జరిపిన న్యాయస్థానం.. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరపాలన్న నిర్ణయంపై స్టే ఇవ్వలేమని తెలిపింది. పిటిషన్పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
- ఇదీ చదవండి : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు