Chintamani Natakam : చింతామణి నాటకంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. వైకాపా రెబల్ ఎంపీ రఘురామ వేసిన ఈ వ్యాజ్యంపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అయితే.. ఈ నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున 3 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఇంప్లీడ్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణ సాగదీసేందుకే ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారా?.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాది వేదుల వెంకటరమణ ఇంప్లీడ్ పిటిషన్‌ను మాత్రమే అనుమతించింది.
అభ్యంతరం ఉన్న పాత్రనే నిషేధించాలని కోరుతున్నామని న్యాయవాది ఉమేష్ చంద్ర.. వాదనలు వినిపించారు. మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ఆయన ప్రశ్నించారు. వందేళ్ల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. నటుల తరఫున న్యాయవాది శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కి బదిలీ అయ్యింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు పంపిన ధర్మాసనం.. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఇదీచూడండి: