ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు కేటాయించటం ఎందుకు సాధ్యం కాలేదో వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని... ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. పీఎంఏవై ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
ఆ గృహాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు, రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధుల వివరాలతో కౌంటర్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ అంశంపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్. కె. లలిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పీఎంఏవైలో నిర్మించిన 84వేలకు పైగా ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జె. బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండి న్యాయవ్యవస్థను బెదిరించేందుకే జగన్ లేఖ: సుప్రీం న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ