గ్రూప్ 1 ప్రశ్నాపత్రం విషయంలో ఏపీపీఎస్సీ తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ప్రశ్నాపత్రంలో 50కి పైగా తప్పులేమిటని ప్రశ్నించింది. ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేసే సామర్థ్యం లేదా.. నిపుణులేం చేస్తున్నారని నిలదీసింది. తప్పులున్న ప్రశ్నాపత్రంతో పరీక్ష నిర్వహించి ఏపీపీఎస్సీ విజయవంతం అయిందని వ్యాఖ్యానించింది.
గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించేందుకు నిరాకరిస్తూ ఇచ్చిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రెండు అప్పీళ్లపై ఏపీ హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. 2018 డిసెంబర్‌లో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన జారీచేసింది. ఈ పరీక్ష పత్రంలో 51 తప్పులున్నాయంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
- ఇదీచదవండి : పైపులో పాము- రక్షించిన హెల్ప్‌లైన్ సిబ్బంది