ఏపీ గవర్నర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఏఐజీ నుంచి బిశ్వభూషణ్ హరిచందన్ డిశ్చార్జ్(ap governor discharged from AIG) అయ్యారు. అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు.
ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన కొవిడ్ (ap governor tested COVID positive)బారిన పడ్డారు. ఈనెల 17న ఏపీ గవర్నర్ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి(AIG hospital) చేరారు. ప్రజల ఆశీస్సులు, వైద్య సేవల ఫలితంగానే కొవిడ్ నుంచి కోలుకున్నట్లు బిశ్వభూషణ్ హరిచందన్(Bishwabhushan hari chandan)తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం ఎంతో మేలు చేసిందన్న ఆయన.. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ధగా ఉండవద్దని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: