ETV Bharat / city

3 రాజధానులకే మెుగ్గు.. అత్యున్నత న్యాయస్థానానికి జగన్​ సర్కార్​! - ఏపీ తాజా విశేషాలు

AP Govt Challeng HC Orders: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో తన పంతాన్ని వీడడం లేదు. ఆరు నెలల్లో అమరావతి రాజధానిలో నిర్మాణాలు జరగాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సరే వాటిని బేఖాతరు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సవాల్​ చేసింది.

ap state government
ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం
author img

By

Published : Sep 17, 2022, 2:08 PM IST

AP Govt Challeng HC Orders: రాష్ట్రానికి అమరావతే రాజధాని అని 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 3 రాజధానులు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అమరావతే రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్న రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరింది.

రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదనడం సరికాదని సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్‌లో పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించిందని... అది రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.