Tomato prices: వేసవి కాలం కావడంతో కూరగాయల దిగుబడులు తగ్గిపోయాయి. వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే పెరిగిన టమాటా ధరలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. రేపటి నుంచి తక్కువ ధరలకు టమాటా విక్రయిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వమే స్వయంగా పక్క రాష్ట్రాల నుంచి టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రంలోని అన్ని రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఏపీ వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో మే 20 నుంచి తక్కువ ధరలకు టమాటాలు విక్రయిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో టమాటా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు తక్కువ ధరలకే టమాటాను విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వేసవిలో ఏపీలో టమాటా ఉత్పత్తులు తగ్గాయని... పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్లో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా పక్క రాష్ట్రాల నుంచి టమాటాను కొనుగోలు చేసి.. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
- ఇదీ చదవండి : పొలంలో ఇద్దరు పోలీసుల మృతదేహాలు.. ఏం జరిగింది?